క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతమని ఫ్రాడ్

క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతమని ఫ్రాడ్

బషీర్​బాగ్, వెలుగు: క్రెడిట్ కార్డు లిమిట్ పేరిట ఓ వ్యక్తిని సైబర్ చీటర్స్ ఫ్రాడ్ చేశారు.  హైదరాబాద్ సిటీకి చెందిన 37 ఏండ్ల ప్రైవేట్ ఉద్యోగికి తొలుత స్కామర్స్ ఫోన్ కాల్ చేశారు. ఇండస్ ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అంటూ మాట్లాడారు. క్రెడిట్ కార్డు లిమిట్ దాటిపోయిందని, ఇన్సూరెన్స్ చార్జెస్ కూడా చెల్లించాల్సి ఉందన్నారు. ఈ చార్జెస్ చెల్లించకుండా ఉండాలంటే క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవాలన్నారు. 

అందుకు బాధితుడికి వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్ పంపారు. ఆ ఫైల్ ఇన్​స్టాల్ చేసిన కాసేపటికి బాధితుడి అకౌంట్ ​నుంచి రూ.1,47,004  డెబిట్ అయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించి, సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.