
ఉన్నత విద్య, క్రమశిక్షణతో వ్యక్తిగత ఎదుగుదలతోపాటు, సామాజికాభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి.ఆదివారం( సెప్టెంబర్ 17) రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంతాపూర్ లో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు వివేక్ వెంకటస్వామి.
- ALSO READ | తెలంగాణ కోసం వీహెచ్ దేశాయ్ పోరాడారు..
అణగారిని వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని.. విద్య, క్రమశిక్షణతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన అంబేద్కర్.. 23 డిగ్రీలు పొందారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆదర్శంగా చదువులో రాణించాలని యువతకు సూచించారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి.