ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ (ఇంగ్లీష్ లేదా హిందీ) నైపుణ్యం కలిగి ఉండాలి. వయసు కనిష్టంగా 18 ఏళ్లు, గరిష్టంగా యూఆర్/ ఈడబ్ల్యూఎస్‌లకు 30 ఏళ్లు, ఓబీసీలకు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 35 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 40 ఏళ్లు మించకూడదు.
సెలెక్షన్: రిక్రూట్‌మెంట్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. మార్చి 27 వరకు ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.upsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.