న్యూఢిల్లీ : మూడు కోట్లకు పైగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ల డేటాను ఓ హ్యాకర్ ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. వీరి పాన్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఇప్పటికే ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వంటి వివరాలు జెన్‌జెన్‌గా పిలిచే హ్యాకర్ వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉన్నాయి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ చిఫ్ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఐఎస్‌ఓ) 3.1 కోట్ల మంది కస్టమర్ల డేటాను తనకు అమ్మాడని, తర్వాత తమ డీల్‌లోని టర్మ్స్‌ను మార్చడానికి ప్రయత్నించాడని ఈ హ్యాకర్ చెబుతున్నాడు.
హ్యాకర్ జెన్‌జెన్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన డేటాను, కంపెనీ టాప్ అఫీషియల్ జరిపిన ఈ–మెయిల్స్ శాంపిల్ డేటాను తన వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేశాడని కిందటి నెల 20 న యూకే రీసెర్చర్ జాసన్ పార్కర్ పేర్కొన్నారు. ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ నిపుణలతో క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నామని కంపెనీ ప్రకటించింది. సీఐఎస్‌ఓ దర్యాప్తుకు సహారించాడని తెలిపింది.
ఎల్ & టీ సంస్థ రూ.5.50 కోట్ల విరాళం
ముఖ్యమంత్రి సహాయనిధికి ఎల్ అండ్ టీ సంస్థ విరాళం అందజేసింది. ఎల్ అండ్ టి సంస్థ చైర్మన్ సుబ్రమణ్యం బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి, రూ.5.50 కోట్ల చెక్‌ను విరాళంగా అందజేశారు.