మీ ప్రైవసీకి భంగం కలగకుండా.. ‘దూస్రా’ నెంబర్

మీ ప్రైవసీకి భంగం కలగకుండా.. ‘దూస్రా’ నెంబర్

పర్సనల్ ఇన్ఫర్మేషన్ చోరీ కాకుండా ‘దూస్రా’ నెంబర్

వెలుగు, బిజినెస్‌‌‌‌‌‌‌‌డెస్క్: స్పామ్‌‌‌‌‌‌‌‌ కాల్స్, హెరాస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కాల్స్ నుంచి తప్పించుకోవడానికి, మన పర్సనల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్, ప్రైవసీకి ఇబ్బందులు లేకుండా ‘దూస్రా’ను క్రియేట్ చేసింది టెన్20ఇన్ఫో మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ యాప్‌‌‌‌‌‌‌‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లాంఛ్ చేశారు.  స్పామ్ కాల్స్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకోవడంలో దూస్రా ఒక మంచి పరిష్కారంగా నిలుస్తుందని కొనియాడారు. ‘దూస్రా’ లాంఛ్ సందర్భంగా కంపెనీ ఫౌండర్, సీఈఓ ఆదిత్య వుచి ‘వెలుగు’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ….

దూస్రా అంటే ఏమిటి? దీన్ని క్రియేట్ చేయాలనే ఆలోచన ఎలా పుట్టుకొచ్చింది…?

దూస్రా అనే 10 డిజిట్ వర్చ్యువల్ మొబైల్ నెంబర్. షాపింగ్ మాల్స్‌‌‌‌‌‌‌‌లో, బిల్లు కౌంటర్ల వద్ద, ఇతర ప్రాంతాల్లో మన పర్సనల్ నెంబర్ ఇవ్వాల్సినవసరం లేకుండా.. దూస్రా నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇచ్చుకోవచ్చు. మీ మొబైల్ నెంబరే మీకు ఐడెంటీగా మారింది. ఈ సమయంలో మీ పర్సనల్ నెంబర్ పబ్లిక్ డొమైన్‌‌‌‌‌‌‌‌లో ఇవ్వడం వల్ల మీ పర్సనల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌కు, ప్రైవసీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నో అన్‌‌‌‌‌‌‌‌వాటెండ్ కాల్స్, హెరాస్‌‌‌‌‌‌‌‌మెంట్ కాల్స్, మెసేజ్‌‌‌‌‌‌‌‌లు వచ్చి కస్టమర్లను  ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమయంలో మీ పర్సనల్ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బదులుగా… దూస్రా నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇచ్చుకోవచ్చు. దూస్రా డాట్ కామ్‌‌‌‌‌‌‌‌కి వెళ్లి వర్చ్యువల్ మొబైల్ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పొందవచ్చు. ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను కూడా టెల్కోలతో జతకట్టి కస్టమర్లకు జారీ చేస్తున్నాం.  దూస్రాను క్రియేట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే.. షాపింగ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లినప్పుడు కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నా పర్సనల్ మొబైల్ నెంబర్ అడిగారు. నాకు ఇవ్వడం ఇష్టం లేదు. ఇవ్వనని చెప్పాను. అయితే బిల్లింగ్ చేయలేమని కౌంటర్ వాళ్లు చెప్పారు. అప్పుడే అనిపించింది.. మొబైల్ నెంబర్ ఇవ్వడం ఇష్టం లేని ప్రాంతాల్లో వర్చ్యువల్ నెంబర్ ఇచ్చుకునే ఫెసిలిటీ కల్పించాలని. ఒక చోట మనం ఇచ్చే నెంబర్​10 చోట్లకి వెళ్లిపోతుంది. దానివల్ల మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి.  అయితే మనం పర్సనల్ నెంబర్ ఇచ్చామా? మరేదైనా ఇచ్చామా? అని కౌంటర్ వాళ్లు ఓటీపీ పంపి చెక్ చేస్తారు. దూస్రా నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓటీపీ కూడా వస్తుంది. దాన్ని వాళ్లకు చూపిస్తే చాలు. ప్రస్తుతం, మన వ్యక్తిగత మొబైల్‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌తో మన ప్రతి పర్సనల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఖాతాలు, పేరు, అడ్రస్, సోషల్‌‌‌‌‌‌‌‌మీడియా ప్రొఫైల్స్‌‌‌‌‌‌‌‌, ఈ–మెయిల్‌‌‌‌‌‌‌‌ అడ్రస్‌‌‌‌‌‌‌‌లు, మనం ఉన్న ప్రాంతం వంటివన్నీ అనుసంధానమై ఉంటాయి. ఒకవేళ ఈ మొబైల్‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌ ఏదైనా పబ్లిక్‌‌‌‌‌‌‌‌డొమైన్‌‌‌‌‌‌‌‌లో సర్కులేట్‌‌‌‌‌‌‌‌ అయితే, అది మన ఐడెంటీతో పాటు పర్సనల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయి. దీనికి సొల్యూషన్‌‌‌‌‌‌‌‌గానే వర్చ్యువల్‌‌‌‌‌‌‌‌ మొబైల్‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌. దీనిని ఎక్కడైనా,  ఎవరితో అయినా పంచుకోవచ్చు. రెగ్యులర్ మొబైల్‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌ను పంచుకోవాల్సిన అవసరం లేకపోవడం చేత స్పామ్‌‌‌‌‌‌‌‌, అన్‌‌‌‌‌‌‌‌వాంటెడ్ కాల్స్‌‌‌‌‌‌‌‌, పర్సనల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ చోరిని నివారించవచ్చు.

దూస్రా ఎలా పనిచేస్తుంది ?

రెగ్యులర్ మొబైల్ నెంబర్ మాదిరే ఇది పనిచేస్తుంది. దూస్రా నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే ప్రతి  కాల్, ప్రతి మెసేజ్ బ్లాక్ అవుతుంది. మనం కావాలనుకుంటే ట్రస్టీ కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌గా సేవ్ చేసుకుంటే, ఆ కాల్ రెగ్యులర్ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫార్వర్డ్ అవుతుంది. దూస్రా నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం వల్ల ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ కాల్స్, ఇతర కాల్స్ మిస్ అవుతామనే ఇబ్బందులేమీ లేవు. నాలుగు మార్గాల్లో దూస్రా నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్స్ బ్లాక్ కాకుండా కూడా చూసుకోవచ్చు. కాల్ బ్లాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొద్ది సేపు ఆపివేసుకుని, ఇంటర్వ్యూ లాంటి కాల్స్ పొందడం. ఆఫీసులో ఉన్నప్పుడు లొకేషన్‌‌‌‌‌‌‌‌ బట్టి కూడా కాల్ బ్లాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆపివేసుకోవచ్చు. ఇంకా దూస్రా నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే ప్రతి కాల్.. దూస్రా యాప్‌‌‌‌‌‌‌‌లో సేవ్ అయి ఉంటుంది. దూస్రా యాప్ ద్వారా నెంబర్లు చూసుకుని అవసరం అనుకుంటే మళ్లీ వాళ్లకి రిటర్న్ బాక్ చేయొచ్చు. అయితే దూస్రా నెంబర్ నుంచి అవుట్‌‌‌‌‌‌‌‌గోయింగ్ కాల్స్ చేసుకోలేం. రెగ్యులర్ నెంబర్ నుంచి మళ్లీ మనం రిటర్న్ కాల్ చేసుకోవచ్చు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, లాంటి కాల్స్‌‌‌‌‌‌‌‌ను మనం అనుమతించాలనుకుంటే, దూస్రా నెంబర్ తీసుకునేటప్పుడే తెలపాల్సి ఉంటుంది.

దూస్రా రెవెన్యూ మోడల్ ఏమిటి?

దూస్రా నెంబర్  ఆరు  నెలల సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌కు రూ.501, ఏడాదికి రూ.701 చెల్లించాలి.ఈ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షనే మాకు రెవెన్యూ. కస్టమర్ల డేటాను ఎక్కడా అమ్మం.  యాడ్స్​ కూడా ఉండవు.

ట్రూకాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, దూస్రాకు తేడా ఏమిటి..?

ట్రూకాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీ మొత్తం కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌ బుక్ వాళ్ల దగ్గరుంటుంది. అంతేకాక అవతలి వారి ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ ఉంటుంది. దీంతో వారు కొన్ని కాల్స్‌‌‌‌‌‌‌‌ను స్పామ్‌‌‌‌‌‌‌‌లోకి మరలిస్తున్నారు. కానీ మా వద్ద మీ కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఎలాంటి ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ ఉండదు. మీరు ఎక్కడైతే పర్సనల్ నెంబర్ ఇవ్వకూడదని, ఈ దూస్రా నెంబర్ ఇస్తారో.. ఆ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే ప్రతికాల్‌‌‌‌‌‌‌‌ను బ్లాక్ చేస్తాం. అంతే తప్ప మీ కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌ను యాక్సస్ చేసి, మీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్ పొందం. దూస్రా నెంబర్  వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. బ్యాంకింగ్, వర్క్ ప్లేసెస్‌‌‌‌‌‌‌‌లో దూస్రా నెంబర్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌కు వేరే రెగ్యులేషన్స్ ఉంటాయి. దూస్రా నెంబర్ ఇస్తే ఆ నెంబర్ బ్లాక్ అవుతుంది. కావాలనుకుంటే అలా ఇచ్చుకోవచ్చు. డ్యామేజ్ జరిగే ఇష్యూ ఏమీ ఉండదు. ఇన్‌‌‌‌‌‌‌‌కమింగ్ కాల్ వస్తుంది కేవలం.. ఆ కాల్‌‌‌‌‌‌‌‌ను అటెంట్ చేయాలా? లేదా? అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది.

For More News..

77 ఏళ్ల వయసులో కొత్త బిజినెస్.. ఫుల్ సక్సెస్

ప్రైవేట్ ట్రావెల్స్‌కు రూట్ క్లీయర్ చేస్తున్న సర్కార్

ఆరేంజ్ ఆ రేంజ్‌లో ఆడుతుందా?