హైదరాబాద్ నగరంలో వాహనం లేనిదే రోజు గడవదు..నిత్యం బిజీగా ఉండే నగరంలో వ్యాపారం చేయాలన్నా..త్వరగా స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లాలన్నా..టైం సేవ్ చేయాలంటే సొంత వెహికిల్ తప్పని సరి అయిపోయింది. ఉద్యోగులు, వ్యాపారులు, స్టూడెంట్లు, వీధి వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక వెహికల్ కలిగి ఉన్నారు. ఈక్రమంలో హైదరాబాద్ లో వాహనాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. టూవీలర్స్, ఫోర్ వీలర్ వాహనాల సంఖ్యం 70 లక్షల మార్క్ ను దాటింది.
ఆర్టీఏ గణాంకాల ప్రకారం.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ఇప్పటివరకు 56.9 లక్షల బైక్ లు, 14.1 లక్షల ఫోర్ వీలర్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి.మొత్తంగా నగరంలో 77.4 లక్షల రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నాయి. ఇందులో 1.07 లక్షల ఆటో రిక్షాలు, 3.07 లక్షల గూడ్స్ క్యారేజీలు, 90వేల పైగా క్యాబ్ లు ఉన్నాయి.
ఆసక్తికరమై విషయం ఏమిటంటే.. గత కొన్ని సంవత్సరాలుగా ఫోర్ వీలర్ వాహనాల సంఖయం వేగంగా పెరుగుతోంది. 2017లో కార్ల సంఖ్య 9.20 లక్షలుండగా.. 2023లో 14.1 లక్షలకు చేరుకుంది. త్వరలో 15 లక్షలకు చేరుతుందట. 2017లో 39.54 లక్షలున్న ద్విచక్రవాహనాలు 2023లో 56.6 లక్షలకు పెరిగాయి.
Also Read :- ఏపీ రైలు ప్రమాదం
నిత్యజీవితంలో వెహికల్ అవసరం బాగా పెరిగింది. ఫోర్ వీలర్ అంటే కార్లు, ఇతరాలు విలాసవంతం అని కాకుండా ప్రాథమిక అవసరంగా మారింది. దీంతో గత అరేళ్లలో ఐదు లక్షల కార్టు నగరంలో రిజిస్టర్ అయ్యాయి.
దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, ఢిల్లీ , ముంబై తర్వాత ఎక్కువ వాహనాలున్న నగరాల జాబితాలో హైదరాబాద్ ఐదో స్థానంలో ఉంది. బెంగళూరులో 1.1 కోట్లు, ఢిల్లీలో 79 లక్షలు,2021 నాటికి చెన్నైలో 60 వాహనాలున్నాయి.