AUS vs IND: బ్లాక్ బస్టర్ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. తొలి టెస్టుకు 85 వేలమంది ప్రేక్షకులు

AUS vs IND: బ్లాక్ బస్టర్ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. తొలి టెస్టుకు 85 వేలమంది ప్రేక్షకులు

ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఈ సారి క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండబోతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈ సిరీస్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అగ్ర జట్లు.. స్టార్ ఆటగాళ్లు.. స్టేడియం నిండా ప్రేక్షకులు.. వెరసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసక్తికరంగా మారుస్తాయి. మరోసారి ఈ మెగా సిరీస్ అభిమానులకు కిక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది.

తొలి టెస్ట్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ జరగబోయే పిచ్ ఇప్పటికే సిద్ధమైంది. బౌన్సీ పిచ్ కూడిన ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామంగా నిలవనుంది. దీంతో బ్యాటర్లకు సవాలుగా మారింది. ఈ మ్యాచ్ చూడడానికి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. పెర్త్ వేదికగా జరగబోయే ఈ టెస్టుకు ఏకంగా 85 వేల మంది ప్రేక్షకులు వస్తారని అంచనా వేయబడింది. తొలి మూడు రోజులకు భారీగా టికెట్స్ అమ్ముడుపోయినట్టు వార్తలు వస్తున్నాయి. 

రెండు అగ్ర శ్రేణి జర్ల మధ్య మ్యాచ్ జరుగుతుండడంతో ప్రపంచ క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ చూడడానికి సిద్ధమయ్యారు. నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్  72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం.