తన వాచీల వివరాలు చెప్పలేదని పెరూ ప్రెసిడెంట్ ఇంట్లో సోదాలు

పెరూ అధ్యక్షురాలు డినా బోలువార్టే  ఖరీదైన రోలెక్స్ వాచీలు ధరించి పబ్లిక్​గా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఆమె ప్రకటించిన ఆస్తుల లిస్టులో ఆ వాచీల వివరాలను పేర్కొనలేదు. ఇదే విషయంపై మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ప్రాసిక్యూషన్ ఆఫీసు అధికారుల విజ్ఞప్తి మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

తాజాగా శనివారం 40 మంది అధికారులు బోలువార్టే ఇంట్లో సోదాలు చేశారు. తనిఖీల ఆపరేషన్ మొత్తం లోకల్ టీవీ చానెల్ లాటినాలో ప్రత్యక్ష ప్రసారం అయింది. అయితే సోదాల్లో రోలెక్స్ వాచీలు దొరికాయా? లేదా? అన్నది వెల్లడి కాలేదు.