- రిజల్ట్స్ రిలీజ్ చేసిన సురేంద్ర మోహన్, లింబాద్రి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పీఈసెట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ కోర్సులకు పరీక్ష రాసిన వారిలో 96.48% మంది అర్హత సాధించారు. బుధవారం మాసబ్ ట్యాంక్ లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో శాతవాహన యూనివర్సిటీ ఇన్ చార్జ్ వీసీ సురేంద్రమోహన్, కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను రిలీజ్ చేశారు.
పీఈసెట్ కు మొత్తం 2,392 మంది దరఖాస్తు చేసుకోగా, ఈ నెల10 నుంచి 13 వరకూ ఫిజికల్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షలకు 1,705 మంది అటెండ్ అయ్యారు. వీరిలో 1,645 మంది క్వాలిఫై అయ్యారు. బీపీఈడీలో 1,198మందికి 1,156 మంది అర్హత సాధించగా, డీపీఈడీలో 507 మందికి 489 మంది పాసయ్యారు. బీపీఈడీలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గొల్ల మహేశ్వరి, డీపీఈడీలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన చిట్టిమల్ల సంధ్య టాపర్ గా నిలిచారు.