ఇంత క్రూరంగా ఉన్నారేంట్రా బాబూ..వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగిస్తే కాల్చి చంపేస్తారా

ఇంత క్రూరంగా ఉన్నారేంట్రా బాబూ..వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగిస్తే కాల్చి చంపేస్తారా

అక్కడి బలహీనమైన చట్టాలు..మరణాయుధాలు ఈజీగా దొరకడం హింసను ప్రేరేపిస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో ఏకంగా ప్రాణాలే తీస్తున్నారు. అమాయకులను చంపేస్తున్నారు. గ్రూప్ చాట్ నుంచి తనను తొలగించాడని  వాట్సాప్ అడ్మిన్ను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. పవిత్రమైన రంజాన్ మాసంలో కూడా ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు.  పాకిస్తాన్ పెషావర్లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంలో వెలుగులోకి వచ్చింది. 

పాకిస్తాన్‌లోని పెషావర్ శివార్లలో గురువారం సాయంత్రం కాల్పులు జరిగాయి. అష్పాక్ అనే వ్యక్తి ముష్తాక్ అనే మరో వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ముష్తాక్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ కాల్పులకు కారణం చాలా చిన్నదే..అయినా దారుణంగా చంపేశాడు.వాట్సాప్ చాట్ నుంచి తనను తొలగించాడని కోపంతో హతమార్చాడు. ఇద్దరం మాట్లాడుకుందాం అని పిలిపించి మరీ కాల్పులు జరిపాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

ALSO READ | ప్రమాదంలో మామ మృతి.. తట్టుకోలేక గుండెపోటుతో కోడలు హఠాన్మరణం

నిందితుడు అష్ఫాక్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తూ పోస్టులు షేర్ చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇటువంటి హింసను చాలామంది నెటిజన్లు వ్యతిరేకించారు. మరణాయుధాలు సులభంగా దొరకడం, పాకిస్తాన్ లో గిరిజన ఆచారాలు, ఆ ప్రాంతంలో చట్టాల అమలు బలహీనం కారణంగా చిన్న వివాదాలు ప్రాణాంతక ఘర్షణలకు దారితీస్తున్నాయని విచారం వ్యక్తం చేస్తున్నారు.