నర్సంపేట, వెలుగు: వరంగల్జిల్లా నర్సంపేటలో రూ. కోటి విలువైన నకిలీ పరుగు మందులను విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. నర్సంపేట ప్రాంతంలో మొక్కజొన్న పంటకు బేయర్ కంపెనీకి చెందిన పురుగుల మందును పిచికారి చేస్తే ఆశించిన ఫలితం రాలేదని రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆఫీసర్లు టౌన్‌లోని హరిట్రేడర్స్ ఫర్టిలైజర్స్పై దాడులు నిర్వహించి బేయర్కంపెనీకి చెందిన పురుగు మందును బిగ్‌హాట్ అనే వెబ్సైట్లో ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
అయితే బేయర్ కంపెనీ పురుగు మందులను ఆన్లైన్లో విక్రయించదు. హరిట్రేడర్స్ ఓనర్ ఆన్లైన్లో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ బేయర్‌కంపెనీ మందును కొనుగోలు చేసి రైతులకు విక్రయించినట్లు గుర్తించారు. ఓనర్‌పై కేసు ఫైల్చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు విజిలెన్స్అండ్ఎన్ఫోర్స్మెంట్సీఐ అనిల్‌కుమార్, ఏవో శ్రీనివాస్, బేయర్ కంపెనీ రీజినల్‌మేనేజర్ అశోక్‌రెడ్డి, నర్సంపేట ఏవో కృష్ణకుమార్, మార్కెంటింగ్మేనేజర్ నారాయణ తెలిపారు.