
హైదరాబాద్ మహానగరం శివారులో కిడ్నాప్ కలకలం రేగింది.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ యువకుడిని ఫైనాన్సర్ శ్రీనాథ్ రెడ్డి కొట్టి కిడ్నాప్చేశాడని కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... న్యూ ఇయర్ వేడుకల కోసం పైనాన్సర్ శ్రీనాథ్‌రెడ్డి దగ్గర .... యశ్వంత్ అనే వ్యక్తి రూ. 5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
తిరిగి డబ్బులు చెల్లించే విషయంలో కాలయాపన చేస్తూ.. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో... సహనం కోల్పోయిన ఈ నెల 14 న హోలీ రోజున శ్రీనాథ్ గ్యాంగ్ ...యశ్వంత్‌ను కిడ్నాప్ చేసి బజాజ్ షో రూమ్ గ్రౌండ్స్ లో తీవ్రంగా దాడి చేశారని యశ్వంత్ తల్లి.. పైనాన్సర్ శ్రీనాథ్ సహా మరో 15 మందిపై కేసు పెట్టింది. తన కుమారుడు కనిపించడం లేదని బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కంప్లయింట్ అందుకున్న పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం 118(1), 127(2) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫైనాన్సర్ శ్రీనాథ్ రెడ్డి వడ్డీ వ్యాపారం చేస్తూ 10 నుంచి 15 రూపాయిల వరకు వసూలు చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. బాధితుడు యశ్వంత్‌ను కిడ్నాప్ చేసిన గ్యాంగ్ బీర్ బాటిల్స్, హాకీ స్టిక్స్, కర్రలు, బెల్ట్ తో దాడి చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.