
కీసర, వెలుగు: కీసర జడ్పీ హైస్కూల్లో పీఈటీ ఆనంద్కర్కశంగా వ్యవహరించాడు. గేమ్స్ పీరియడ్‌లో ఆటలు ఆడేందుకు రాలేదని 8 మంది బాలికలను కరెంట్ వైర్తో గొడ్డును బాదినట్టు బాదాడు. వివరాల్లోకి వెళ్తే.. కీసర జడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రణతి, వైశాలి, కావ్య, నవ్య, శరణ్య, అర్చన, బ్లేస్సీ, కీర్తన గురువారం సాయంత్రం గేమ్స్ పీరియడ్కు వెళ్లలేదు.
దీంతో ఒంట్లో బాగాలేదన్నా వినకుండా వారిని పీఈటీ ఆనంద్కరెంట్వైర్తో చితకబాదాడు. అనంతరం ఇంటికి వెళ్లిన విద్యార్థులు జరిగిన విషయాన్ని చెప్పగా, వారి ఒంటిపై గాయాలు చూసి పేరెంట్స్ షాక్‌కు గురయ్యారు. శుక్రవారం ఉదయం స్కూల్ఎదుట ఆందోళన దిగారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎంఈఓ జనార్ధన్ ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు.
అప్పటికే మీడియాలో వచ్చిన కథనాలు చూసి పీఈటీ ఆనంద్‌ను సస్పెండ్ చేస్తూ డీఈఓ విజయ్ కుమారి ఉత్తర్వులు
జారీ చేశారు.