తాజ్ మహల్ దగ్గర.. కారులో ఊపిరి ఆడక.. కుక్క చనిపోయింది

ప్రాణం ఉన్న ఏ జీవికైనా గాలి, నీరు, వెంటిలేషన్ అవసరం.  ఇవి లేకుంగా జీవించడం చాలా కష్టం. అయితే మనుష్యలకు స్వేచ్చ ఉంటుంది.  ఇక జంతువులను సాధారణంగా బంధిస్తారు.  కుక్క, పిల్లి, కుందేలు ఇలాంటి వాటిని జనాలు పెంచుకుంటారు.  కొంతమందైతే సొంత బిడ్డలకంటే ఎక్కువుగా ప్రేమిస్తారు.  సాధారణంగా పెంపుడు కుక్కలకు బాగా గిరాకీ ఉంటుంది.  కొంతమంది టూర్లకు వెళితే వారితో పాటుగా వారు పెంచుకొనే కుక్కలను కూడా తీసుకెళ్తారు.  అలాగే ఇప్పుడు హర్యానాలో ఓ జంట ఆగ్రాలో తాజ్ మహల్ ను చూసేందుకు కారులో వెళ్లారు. వారు వెళ్లేటప్పుడు కుక్కను కూడా తీసుకెళ్లారు.  తాజ్ మహల్ ను చూడటానికి వెళ్లేటప్పుడు వారు ఆ కుక్కను కారులో నే ఉంచి లాక్ చేసి వెళ్లారు. ఇక అంతే వారు వచ్చి చూసేసరికి ఆ కుక్క విగత జీవిగా కారులో పడి ఉంది.  గాలిలేక ఊపిరాడక ఆ కుక్క మృతి చెందింది. 

ఆగ్రాలో తాజ్ మహల్ టూర్ కు  హర్యానా పర్యాటకులు వచ్చారు.  అయితే వారు వారి పెంపుడు కుక్కను కూడా కారులో తీసుకొచ్చారు. కుక్కను కారులో ఉంచి వారు తాజ్ మహల్ ను చూసేందుకు వెళ్లారు.  ఇకఅంతే ఆ కుక్క ఊపిరాడక మృతి చెందింది.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ALSO READ:5ఆసీస్ ఆటగాళ్లు ఛీటర్స్..వీడియో వైరల్

అమృత్‌సర్‌కు చెందిన ఓ వైద్యుడు తన పెంపుడు కుక్కను దాదాపు ఆరు నెలల పాటు ఇంటి వద్దే ఉంచి, తాళం వేసి వదిలేసిన కొద్ది రోజుల తర్వాత, అలాంటి మరో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాకు చెందిన వారు ఓ జంట  ఆగ్రాలోని ప్రముఖ తాజ్ మహల్‌ను సందర్శించిన సమయంలో వారి పెంపుడు  కుక్కను కారులో ఉంచి బయటకు వెళ్లారు. గాలి,  వెంటిలేషన్,  నీరు లేకుండా గంటల తరబడి కారులో బంధించినందుకు ఆ కుక్క కారులోనే చనిపోయింది.  ఈ ఘటనను చుట్టుపక్కల ప్రజలు తమ ఫోన్ కెమెరాల్లో జంతువు పరిస్థితిని చిత్రీకరించి  ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.  దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది.