Bigg Boss 18: బిగ్బాస్ హౌస్‌లో జంతువుల హింస ఎందుకు..? : సల్మాన్ ఖాన్కు పెటా లేఖ

Bigg Boss 18: బిగ్బాస్ హౌస్‌లో జంతువుల హింస ఎందుకు..? : సల్మాన్ ఖాన్కు పెటా లేఖ

కింగ్ ఆఫ్ రియాలిటీ షోస్ అనిపించుకున్న బిగ్‌‌‌‌బాస్ ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంటే..మరోవైపు హిందీలో బ్లాక్ బ‌స్ట‌ర్ రియాలీటి షోస్ లో ఒకటైన.. బిగ్ బాస్ సీజన్ 18 (Bigg Boss 18) ఇటీవలే గ్రాండ్గా మొదలైంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 18లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే, ఇందులో '19వ కంటెస్టెంట్గా 'గధ్రాజ్' అనే గాడిద (జంతువు) ఉండటంతో అత్యంత క్యూరియాసిటీని రేకెత్తించిన.. నెటిజన్స్ నుంచి విభిన్నమైన రియాక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా తాజాగా (PETA) జంతు సంరక్షణ నుండి కూడా మిశ్రమ స్పందన వచ్చింది. వివరాల్లోకి వెళితే..

పెటా లేఖ:

ఇవాళ బుధవారం (అక్టోబర్ 9న) 'పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్' (PETA) ఇండియాకు చెందిన న్యాయవాది శౌర్య అగర్వాల్, బిగ్ బాస్ 18 హోస్ట్ సల్మాన్ ఖాన్‌కు ఒక లేఖ రాశారు. షోలో గాడిదను(జంతువును) ఉపయోగించి అందరినీ నవ్వించే విషయం కాదని.. జంతువుల హింస ఏ మాత్రం తగదని  తెలిపారు.

Also Read :- 'వెట్టయన్‌' వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు..

"బిగ్ బాస్ హౌస్‌లో 'గధ్రాజ్' గాడిదను ఉంచడంపై తీవ్ర మనోవేదనకు గురైన ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు మాకు రోజుకు వేలాదిగా వస్తున్నాయి. వారి ఆందోళనలో న్యాయముంది. షోలో జంతువును చేర్చడం 'బాధకరం'. వారి ఫిర్యాదులను బాధ్యతాయుతమైన ఆలోచనతో దీన్ని పరిరక్షించే అవకాశం ఉందని" లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మేరకు 'PETA' కు ఆ గాడిదను అప్పగించాలని.. అక్కడ రక్షించబడిన ఇతర గాడిదలతో అభయారణ్యంలోకి తిరిగి పంపించాలని' న్యాయవాది శౌర్య సల్మాన్‌ను లేఖలో కోరాడు. కాగా కంటెస్టెంట్స్లో ఒకరైన న్యాయవాది సదావర్తే ద్వారా గాడిదను ఇంట్లోకి తీసుకొచ్చారని లేఖ ద్వారా వెల్లడించారు. 

పబ్లిక్ రియాక్షన్స్:

బిగ్ బాస్ మేకర్స్ ఈ పేద గాడిదను ఒక్క చిన్న ప్రదేశానికి ఎందుకు పరిమితం చేసారు? అలా అరిచేందుకు తన కోసం ఏం చేస్తున్నారో ఎవరికి తెలుసు. మేకర్స్ దయచేసి దాన్ని బయటకు రప్పించండి. ఇది జంతు హింస. ఒక జంతువు, ఆసరా కాదు. మరీ టూ మచ్ కదా అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అలాగే 'జంతువును చేర్చడం చాలా మంది తమాషాగా భావిస్తే, మరికొందరు సామాజిక జంతువు అయిన గాడిదను బిగ్ బాస్ హౌస్‌లో పరిమితం చేయడం సరైంది కాదని అన్నారు.