జల్లికట్టు ఆటను కొనసాగించాలని తమిళనాడు అసెంబ్లీ చేసిన చట్టాన్ని గతంలో సుప్రీంకోర్టు సమర్థించింది. జల్లికట్టు, ఎద్దుల బండి పోటీలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మహారాష్ట్రలో ఎద్దుల బండి పందేలను, తమిళనాడులో జల్లికట్టును అనుమతిస్తున్నట్లు బార్ అండ్ బెంచ్ పోర్టల్ నివేదించింది .జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం (పీసీఏ చట్టం)కు తమిళనాడు చేసిన సవరణల ఆధారంగా కోర్టు తీర్పునిచ్చింది.
ALSO READ :10ఏళ్ల బాలికను పని మనిషిగా పెట్టుకుని కొట్టారు.. జైలు పాలయ్యారు
జల్లికట్టు, ఎద్దుల బండ్ల పోటీల్లో జంతువులకు గాయాలవుతాయని.. ఒక్కోసారి మరణించే పరిస్థితులు కూడా ఉంటాయని PETA పేర్కొంది. అయితే గతంలో ఎద్దుల బండి పోటీలను నిర్వహించుకొనేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 48కి సంబంధించినది కాదని ... వ్యవసాయ కార్యకలాపాలను ప్రభావితం చేసే ఎద్దులను హింసిస్తున్నారని పెటా పేర్కొంది. ఇది భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లోని ఎంట్రీ 17, జాబితా IIIకి సూచిస్తుంది.
2014 మే లో జల్లికట్టు పోటీలు జంతువుల హక్కులను ఉల్లంఘించడమేనని, ఇది తమిళనాడు సంప్రదాయం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే, జనవరి 2016లో, మహారాష్ట్రలో జల్లికట్టు , ఎద్దుల బండ్ల పందేలకు పిసిఎ చట్టం పరిధి నుండి మినహాయింపు ఇస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.