తొండాట ఆడటం ఆస్ట్రేలియా క్రికెటర్లకు మాములే కదా అందులో వింతేముంది అంటారా! ఉంది. ఇది ఇతర దేశాలపై తొండాట కాదు. వారిలో వారికే. ఈ ఆసక్తికర ఘటన ఆసీస్ దేశీవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ 2023-24లో చోటు చేసుకుంది.
ఏం జరిగిందంటే?
షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా ఆడిలైడ్ వేదికగా విక్టోరియా- సౌత్ ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో విక్టోరియా ఇన్నింగ్స్ 13 ఓవర్లో సౌత్ ఆస్ట్రేలియా బౌలర్ బెన్ డగెట్ అద్బుతమైన అవుట్ స్వింగర్గా సంధించాడు. దాన్ని విక్టోరియా బ్యాటర్ పీటర్ హ్యాండ్స్ కాంబ్ డిఫెన్స్ ఆడబోగా.. బంతి ఎడ్జ్ తీసుకుని థర్డ్ స్లిప్లో ఉన్న జేక్ లెమాన్ చేతికి వెళ్లింది. వెంటనే సౌత్ ఆస్ట్రేలియా ఫీల్డర్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్ గా ప్రకటించాడు.
అయితే, హ్యాండ్స్ కాంబ్ మాత్రం అది నాటౌట్ అని పట్టుబట్టాడు. స్లిప్ ఫీల్డర్ సరిగా క్యాచ్ అందుకోలేదని, మైదానం విడిచి వెళ్లనని మొండికేశాడు. రిప్లేలో క్లియర్గా క్యాచ్ను అందుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అతడు అలానే వాదించాడు. చివరకు ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకుని అతడి దగ్గరకు వెళ్లి మాట్లాడి ఫీల్డ్ నుంచి బయటకు పంపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Peter Handscomb refused to leave after edging to the slips until being sent on his way by the umpires ? #SheffieldShield#PlayOfTheDay pic.twitter.com/7hs8u47tX7
— cricket.com.au (@cricketcomau) November 28, 2023