హైటెక్స్ లో పెటెక్స్ షురూ..

హైటెక్స్ లో పెటెక్స్ షురూ..

మాదాపూర్ హైటెక్స్​లో శుక్రవారం పెటెక్స్ ఎక్స్ పో, కిడ్స్ ఫెయిర్, కిడ్స్ కార్నివాల్ మొదలయ్యాయి. మూడ్రోజులపాటు ఉదయం10 గంటల నుంచి రాత్రి 8 వరకు కొనసాగనున్నాయి. టర్కీ, చెక్ రిపబ్లిక్, జపాన్, సింగపూర్, జర్మనీ దేశాలతోపాటు దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన కళాకారులు, జంతు ప్రేమికులు, ఎంటర్​ప్రెన్యూర్లు స్టాల్స్ ఏర్పాటు చేశారు. మొదటిరోజు పెటెక్స్​లో నిర్వహించిన గుర్రాల జంప్ షో, ఇంటర్నేషనల్ ​క్యాట్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్, డాగ్స్​ఫ్యాషన్, టాలెంట్​ షోలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. 

Also Read :- తెలంగాణలో తగ్గిన నిరుద్యోగం

క్యాట్​చాంపియన్‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌లో 200 రకాల పిల్లులు పాల్గొంటున్నాయి. మైనేకూన్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద పెంపుడు పిల్లి స్పెషల్​ అట్రాక్షన్​గా నిలుస్తోంది. శనివారం సాయంత్రం కిడ్స్ 4కె, 2కె, 1కె రన్ నిర్వహిస్తున్నట్లు హైటెక్స్ బిజినెస్ ​హెడ్​శ్రీకాంత్​తెలిపారు. కిడ్స్​కార్నివాల్​లో 90 మంది కిడ్స్‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌లు పాల్గొంటున్నారన్నారు. 

– వెలుగు, మాదాపూర్