
ప్రముఖ యాప్ ‘గూగుల్ పే’ పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ యాప్‌ను రిజర్వ్ బ్యాంక్ సర్టిఫికేషన్ లేదంటూ అభిజిత్ మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈయాప్ పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘించిందని, నగదు బదిలీలు చేసేందుకు ఈయాప్ కేంద్ర బ్యాంకు నుండి సరైనా వెరిఫికేషన్ లేదని మిశ్రా పిటిషన్‌లో తెలిపారు. అంతేకాక ఈ ఏడాది మార్చి 20న RBI విడుదల చేసిన అధికారిక పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ లిస్టులో గూగుల్ పే పేరు లేదని ఆయన తెలిపారు. అయితే మిశ్రా పిటిషన్ పై దర్యాప్తు చేపిట్టిన కోర్టు అధికారిక వెరిఫికేషన్ లేకుండానే గూగుల్ పే యాప్ కార్యకలాపాలను ఎలా సాగిస్తోందని RBI ని ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలని ఆర్‌బీఐ, గూగుల్ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు.