తెలంగాణ హైకోర్టులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు రాజు యాదవ్.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పై గెలిచిన దానం నాగేందర్ ..కొన్ని రోజుల రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం దానం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్నారు. ఒక పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుండి ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని పిటిషన్ లో తెలిపారు. దానం నాగేందర్ పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేశారు. దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై మార్చి 28న హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీచేస్తుండగా.. బీఆర్ఎస్ నుంచి పద్మారావు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీచేస్తున్నారు.