అఘాయిత్యాలపై హైకోర్టులో పిటిషన్: కేఏ పాల్

అఘాయిత్యాలపై హైకోర్టులో పిటిషన్: కేఏ పాల్

హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని ప్రజా శాంతి పార్టీ చీఫ్​కేఏ పాల్అన్నారు. లైంగిక దాడులు జరగకుండా ఉండాలంటే  తీసుకోవాల్సిన చర్యలను అందులో పొందుపరిచానని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి , నెలలో ఛార్జ్ షీట్ వేసి , మూడు నెలల్లో శిక్షను ఖరారు చేయాలని డిమాండ్​చేశారు. నిందితుడి ఆస్తిలో 50 శాతం బాధితురాలి కుటుంబానికి అందజేయాలని సూచించారు. దీనిపై మూడు వారాల తర్వాత విచారణ జరగనుందని చెప్పారు. 

ALSO READ | ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి

బషీర్ బాగ్‎లోని ఈడీ ఆఫీస్ వద్ద ఆయన మీడియా మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు నవంబర్ 4 కు వాయిదా పడింది. గతంలో బీఎస్పీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపు చేసిన ఘటనలో ఇందిరా గాంధీపై అనర్హత వేటు పడింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీల్లో చేర్చుకున్నారు. నవంబర్ 4న పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో తుది తీర్పు వస్తుందని భావిస్తున్నాను. మరోసారి ఎవరు పార్టీలు మారకుండా ఉండాలంటే, ఈ ఎమ్మెల్యేలపై వేటు పడాలి’ అని అన్నారు.