
హైదరాబాద్: హకీంపేటలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్ న్ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషిన్ దాఖలైంది. హకీంపేటకు చెందిన కుమ్మరి శివకుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. నోటిఫికేషన్ ను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు. పరిహారం చెల్లించేంతవరకు నోటిఫికేషన్ పై స్టే విధించాలని తెలిపారు.
హకీంపేటలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణకు అప్పటి ప్రభుత్వం 2024 నవంబర్ 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. హకీంపేట గ్రామంలో 351 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే హకీంపేటకు చెందిన కుమ్మరి శివకుమార్ భూసేకరణ ఆపాలని హైకోర్టులో పిటిషన వేశారు. పరిహారం చెల్లించే వరకు భూసేకరణ చేపట్టొద్దని పిటిషన్ వేశారు.
Also Read :- నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్
పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ జే. శ్రీనివాస రావు హకీంపేట భూసేకరణపై స్టే విధించారు. -ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, టీఎస్‌ఐఐసీ ఎండీకి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ ఏప్రిల్ 7 తేదీకి వాయిదా వేశారు.