సింగరేణి గని కార్మికులకు పెన్షన్​ పెరిగేలా చూడాలి

సింగరేణి గని కార్మికులకు పెన్షన్​ పెరిగేలా చూడాలి

గోదావరిఖని, వెలుగు :  సింగరేణిలో పనిచేసి రిటైర్డ్​ అయి,  తక్కువ పెన్షన్​ పొందుతున్న ఉద్యోగుల  పెన్షన్​  పెరిగేందుకు కృషి చేయాలని రిటైర్డ్​ ఉద్యోగులు  హైదరాబాద్​ సింగరేణి భవన్​లో  సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల లీడర్లు సీతారామయ్య, జనక్​ ప్రసాద్​కు వినతి పత్రం అందించారు.  కోల్​ఇండియాతో పాటు సింగరేణిలో చాలా మంది రిటైర్డ్​ కార్మికులు తక్కువ పెన్షన్​తో  బతుకుతున్నారని,  ఈ విషయాన్ని జాతీయ స్థాయి లీడర్లతో చర్చించి

కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు. ఈ  కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రాంచందర్ రావు, వేణుమాధవ్, బీరయ్య, నర్సింగరావు, కనకయ్య, పూర్ణ ప్రకాశ్​, కోల్ మైన్స్​ పెన్షనర్స్​ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం. బాబురావు, ఎరబాటి రంగారావు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.