హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఇవాళ హైకోర్టుకు సెలవు కావడంతో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నేరస్తులతో కలిపి పట్నం నరేందర్ రెడ్డిని ఉంచారని పిటిషన్లో నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ పిటిషన్ను హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలించారు.
నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది చేసిన ఈ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. లగచర్లలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి అరెస్టై రిమాండ్ కారణంగా చర్లపల్లి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. మాజీ ఎంఎల్ఏ స్పెషల్ బ్యారక్లో పట్నం నరేందర్ను ఉంచాలని న్యాయవాది కోరారు. ఈ అభ్యర్థనను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించారు.
లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై దాడికి పాల్పడ్డ కేసులో కొండగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్లోని ఫిల్మ్‌నగర్‌లో వాకింగ్కు వెళ్లిన ఆయనను జిల్లా క్రైం, కొడంగల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి వికారాబాద్లోని పోలీస్ ఆఫీసుకు, తర్వాత జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు.
ALSO READ | ధాన్యం కొనుగోలులో రైసు మిల్లర్లతో సమస్య లేదు : మంత్రి పొన్నం ప్రభాకర్
అక్కడ హైదరాబాద్మల్టీ జోన్ -–2 ఐజీ సత్య నారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్ది, పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్ది, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్ది తదితరులు దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు. తర్వాత నరేందర్‌రెడ్డిని పరిగి పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి కొండగల్ ప్రభుత్వ దవాఖానకు వైద్య పరీక్షల కోసం తరలించారు. రిమాండ్రిపోర్టులో ఆయనను ఏ1గా చేర్చారు.
కన్ఫెషన్ స్టేట్మెంట్లో తానే సురేశ్తో దాడి చేయించానని, ఆర్థికంగా సహకరించారనని నరేందర్‌రెడ్డి ఒప్పుకోవడంతో ఏ1గా ఆయనను చేర్చినట్లు, ఏ2గా సురేశ్ను మార్చినట్లు పోలీసులు తెలిపారు. అంతకు ముందు వరకు సురేశ్ పేరు ఏ1గా ఉండేది. బుధవారం సాయంత్రం కొండగల్ ఫస్ట్ క్లాస్మెజిస్ట్రేట్శ్రీరామ్ ఎదుట నరేందర్‌రెడ్డిని హాజరుపరచగా 14 రోజులు జ్యుడీషియల్‌రిమాండ్ విధించారు. దీంతో నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.