దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. లీటర్ పెట్రోల్ పై 80 పైసలు, డీజిల్ పై 70 పైసలు పెరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. ఢిల్లీలో పెట్రోల్ వంద రూపాయల 21 పైసలు, డీజిల్ 91 రూపాయల 47 పైసలకు పెరిగింది. హైదరాబాద్ లో పెట్రోల్ 113 రూపాయల 61 పైసలు, డీజిల్ 99 రూపాయల 84 పైసలకు చేరింది. విశాఖలో పెట్రోల్ 113 రూపాయల 43 పైసలు, డీజిల్ 99 రూపాయల 47 పైసలకు ఎగబాకింది.గడిచిన ఎనిమిది రోజుల్లో వరుసగా ఏడుసార్లు పెరిగాయి పెట్రోల్, డీజిల్ ధరలు.
ముంబైలో పెట్రోల్ 115 రూపాయల 4 పైసలు, డీజిల్ 99 రూపాయల 25 పైసలుగా ఉంది. చెన్నైలో పెట్రోల్ 105 రూపాయల 94 పైసలు, డీజిల్ 96 రూపాయలకు పెరిగింది. కోల్ కతాలో పెట్రోల్ 109 రూపాయల 68 పైసలు, డీజిల్ 94 రూపాయల 62 పైసలకు చేరింది. బెంగళూరులో పెట్రోల్ 105 రూపాయల 62 పైసలు, డీజిల్ 89 రూపాయల 70 పైసలుగా ఉంది.
ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలని.. ఈ అంశంపై ప్రధాని మోడీ పార్లమెంట్ లో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు నిన్న డిమాండ్ చేశాయి. ధర పెంపునకు రష్యా- ఉక్రెయిన్ యుద్ధమే కారణమన్న కేంద్రం వాదనను తోసిపుచ్చాయి ప్రతిపక్షాలు.