రెండో రోజు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

రెండో రోజు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కొనసాగుతోంది. వరసగా రెండో రోజులు చమురు ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలకు చేరింది. డీజిల్ 96 రూపాయల 36 పైసలకు చేరింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మళ్లీ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. నిన్న వంట గ్యాస్ తో పాటు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచిన విషయం తెలిసిందే.  రెండు రోజుల్లోనే ఏకంగా లీటర్ పెట్రోల్ పై రూపాయి 80 పైసలు పెరిగింది. 
తాజాగా ఇవాళ్టి పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర రూ.110, లీటరు డీజిల్ ధర రూ.96.36కు చేరుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోనూ లీటరు పెట్రోలు 87 పైసలు, డీజిల్ 84 పైసలు పెరిగింది. విజయవాడ/గుంటూరులో లీటర్ పెట్రోలు ధర రూ.112.08కి చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.10కి చేరింది. 

 

ఇవి కూడా చదవండి

ఐటీ రిటర్న్‌‌ను ఎలా ఫైల్ చేయాలంటే..

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్