మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే.?

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే.?

దేశంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్ పై 30 పైసలు పెరిగింది. పెట్రోల్ లీటరు ధర 102 రూపాయల 64 పైసలకు, డీజిల్ 91 రూపాయల 07 పైసలకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ పై 24 పైసలు, డీజిల్ పై 32 పైసలు పెరిగింది. లీటర్ పెట్రోల్ 108 రూపాయల 67 పైసలకు, డీజిల్ 98 రూపాయల 80 పైసలకు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్  100 రూపాయల 23 పైసలు, డీజిల్ 95 రూపాయల 59 పైసలుగా ఉంది. కోల్ కత్తాలో పెట్రోల్ 103 రూపాయల 36 పైసలు, డీజిల్ 94 రూపాయల 17 పైసలకు చేరింది.హైదరాబాద్ లో లీటర్  పెట్రోల్ ధర రూ. 106.77 డీజిల్ లీటర్ ధర రూ. 99.37 కు చేరింది.

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వరంగ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు రేట్లను పరిగణనలోకి తీసుకొని ప్రతిరోజూ ఇంధన రేట్లను సవరిస్తున్నాయి. విలువ ఆధారిత పన్ను కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ముంబైలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. 

మరిన్ని వార్తల కోసం..

ఆన్‌లైన్‌ గేమ్స్​ ఆడొద్దన్నందుకు​ స్టూడెంట్​ సూసైడ్

సోషల్​ మీడియాలో ఇలా ఉండాలె

ఈమె నోరు విప్పడం వల్లే ఫేస్‌బుక్, వాట్సాప్‌ ఆగిపోయాయా?