గ్లోబల్ మార్కెట్లలో ఆయిల్ ధరలు పెరుగుతుండడంతో, ఇండియన్ మార్కెట్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచుతున్నాయి. తాజాగా పెట్రోల్‌కు 24 పైసలు, డీజిల్‌కు 27 పైసలు పెరిగింది. ఆయిల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం రోజూవారీ ధరల మార్పుకు అవకాశమిచ్చినప్పటి నుంచి ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో, ఎప్పుడు తగ్గుతున్నాయో కూడా తెలియడం లేదు. మనకు తెలియకుండానే ఆయిల్ కంపెనీలు పైసల రూపంలో పెట్రోల్ ధరలు పెంచేస్తున్నాయి. ప్రతిరోజూ 15 పైసలు, 20 పైసలు, 5 పైసలు.. ఇలా ధరలు పెంచడంతో ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. కానీ పైసాపైసా చేరి అది తడిసిమోపెడవుతుంది. నవంబర్ 19న హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 84.25 గా ఉంది. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఎంతోకొంత పైసల రూపంలో పెరిగి శనివారం నాటికి లీటర్ పెట్రోల్ ధర రూ. 85.42కు చేరుకుంది. అదేవిధంగా డీజిల్ ధర కూడా పైసాపైసా పెరిగి లీటర్ డీజిల్ ధర రూ. 78.71కు చేరుకుంది.
For More News..