జమ్ము కశ్మీర్ బరాముల్లా జిల్లా సోపోర్‌లో పెట్రో బాంబు దాడి జరిగింది. బుర్ఖా ధరించిన ఓ మహిళ సంచిలో పెట్రోల్ బాంబును తీసుకొచ్చి నిప్పు అంటించి.. సీఆర్పీఎఫ్ బంకర్‌పై విసిరి పరారైంది. వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ జవాన్లు నీళ్లు పోసి మంటలను ఆర్పేశారు. ఆ పెట్రోల్ బాంబు మహిళ చేతిలోనే పేలినంత పనవడంతో.. టార్గెట్ వరకు పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
The woman who hurled a bomb at the CRPF bunker in Sopore yesterday has been identified. She will be arrested soon: IGP Kashmir Vijay Kumar pic.twitter.com/Wtj5zSvNOf
— ANI (@ANI) March 30, 2022
మహిళ పెట్రోల్ బాంబును విసిరిన ఘటన సీసీటీవీ రికార్డ్ అయింది. దీని ఆధారంగా ఆమెను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపడుతున్నారు. సోపోర్‌లో నిన్న సీఆర్పీఎఫ్ బంకర్‌పై ఓ మహిళ పెట్రోల్ బాంబు విసిరిందని, ఆమెను ఇప్పటి గుర్తించామని కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. నిందితురాలిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారన్న దానిపైనా దర్యాప్తు చేస్తున్నామన్నారు.