హైదరాబాద్‌లో రూ.120కి చేరువలో పెట్రోల్ రేటు

దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెరిగాయి. వరుస బాదుడుతో పెట్రో ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్‌పై సగటున 80 పైసలు చొప్పున పెంచాయి చమురు సంస్థలు. దీంతో హైదరాబాద్‌లో 120 రూపాయలకు చేరువలో పెట్రోల్ ధరలు ఉండగా. ఏపీలో పెట్రోల్ రేటు 120 రూపాయలు దాటింది. హైదరాబాద్‌లో పెట్రోల్ 119 రూపాయల 49 పైసలు, డీజిల్ 105 రూపాయల 49 పైసలకు పెరిగింది. విశాఖలో పెట్రోల్ 120 రూపాయల 81 పైసలు, డీజిల్ 106 రూపాయల 40 పైసలుగా ఉంది. మార్చి 22న ధరల పెరుగుదల ప్రారంభమైన తర్వాత పెట్రో ధరలు 16 రోజుల్లో 14 సార్లు ధరలు పెరిగాయి. రెండు వారాల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ పై దాదాపు 10 రూపాయల వరకు రేట్లు పెరిగాయి.

ఢిల్లీలో పెట్రోల్ 105 రూపాయల 41 పైసలు, డీజిల్ 96 రూపాయల 67 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ 120 రూపాయల 51 పైసలు, డీజిల్ 104 రూపాయల 77 పైసలకు పెరిగింది. కోల్ కతాలో పెట్రోల్ 115 రూపాయల 12 పైసలు, డీజిల్ 99 రూపాయల 83 పైసలుగా ఉంది. చెన్నైలో పెట్రోల్ 110 రూపాయల 95 పైసలు, డీజిల్ 101 రూపాయల 4 పైసలకు చేరింది. బెంగళూరులో పెట్రోల్ 111 రూపాయల 16 పైసలు, డీజిల్ 94 రూపాయల 86 పైసలకు పెరిగింది.

మరిన్ని వార్తల కోసం..

జర్నలిస్టులు ఎంత పనిచేసినా గుర్తింపు తక్కువే

పిల్లల మొదటి స్కూల్‌‌ ఇల్లే

వస్తువులు పోగొట్టుకున్నారా.. మీ సేవకు వెళ్లాల్సిందే!