న్యూఢిల్లీ : లక్షద్వీప్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు లీటర్‌కు రూ.15.30 వరకు తగ్గాయి. మారుమూల దీవులకు ట్రాన్స్‌పోర్ట్ చేసే ఆయిల్‌పై వేసే ఛార్జీని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తొలగించింది. దీంతో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గాయి. లక్షద్వీప్‌లోని మారుమూల ఐలాండ్స్ ఆండ్రోత్, కల్పెనిలో లీటర్ పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.15.30 చొప్పున తగ్గాయి. అదే కవరత్తి, మినికాయ్ దీవుల్లో పెట్రోల్ లీటర్‌కు రూ.5.20 చొప్పున, డీజిల్ రూ.15.31 చొప్పున తగ్గింది.
కవరత్తిలో లీటర్ పెట్రోల్ రేటు రూ.105.94 నుంచి రూ.100.75 కి, డీజల్ రేటు రూ.110.91 నుంచి రూ.95.71 తగ్గింది. ఆండ్రోత్, కల్పెనిలో రూ.116.13 నుంచి రూ.100. 75 కి, డీజిల్ రూ.111.04 నుంచి రూ.95.71 కి దిగొచ్చింది. తగ్గిన రేట్లు అమల్లోకి వచ్చాయి. లక్షద్వీప్‌లో కవరత్తి, మినికాయ్, ఆండ్రోత్, కల్పెని ఐలాండ్లలో ఐఓసీ పెట్రోల్, డీజిల్ అమ్ముతోంది. కంపెనీకి కవరత్తి, మినికాయ్‌లో డిపోలు ఉన్నాయి. కొచ్చి నుంచి సప్లయ్ జరుగుతోంది.