కేంద్ర ప్రభుత్వం దీపావళి గుడ్‌న్యూస్ : డీజిల్, పెట్రోల్ రేట్లు తగ్గనున్నాయా!

కేంద్ర ప్రభుత్వం దీపావళి గుడ్‌న్యూస్ : డీజిల్, పెట్రోల్ రేట్లు తగ్గనున్నాయా!

రాబోయే అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్జిన్‌లను పెంచడం వంటికి ఇంధన ధరల తగ్గుదలను సూచిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఇదే జరిగితే.. దీపావళి పండుగ సందర్భంగా లీటర్ పెట్రోల్, డీజిల్ పై రెండుమూడు రూపాయల వరకు తగ్గుతాయి.

ఇందన శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ వ్యాఖ్యలకు అనుగుణంగా అక్టోబర్ 5 తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని CLSA పేర్కొంది. నవంబర్‌లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ సంవత్సరం మార్చిలో ముడి చమురు రేటు బ్యారెల్ రేటు USD 84 ఉండగా.. సెప్టెంబర్‌లో బ్యారెల్‌కు USD 74 కు తగ్గింది. ఈ విషయం అంచనా వేసి రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయని ICRA సూచిస్తోంది.  

ALSO READ : స్టాక్ మార్కెట్ @ లక్ష పాయింట్లు: 2025లోనే రీచ్ అవుతుందని అంచనా

సెప్టెంబర్‌లో అంతర్జాతీయ ధరల కంటే OMCల నికర రియలైజేషన్ లీటర్ పెట్రోల్ పై రూ.15, డీజిల్ రూ.12 ఎక్కువగా ఉందని ICRA సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీష్‌కుమార్ కదమ్ అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉంటే.. లీటర్ డీజిల్, పెట్రోల్ పై రూ.2 లేదా3  తగ్గొచ్చని ఆయన తెలిపారు.