దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీగా పెరుగుతూ పోతున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో ఇవాళ ఎనిమిదో రోజు పెట్రో రేట్లు పెరిగాయి. ఇవాళ లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 80 పైసలు చొప్పున ధరలు పెరిగాయి. తెలంగాణ, ఏపీల్లో డీజిల్ రేట్లు సెంచరీ దాటాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ 114 రూపాయల 52 పైసలు, డీజిల్ 100 రూపాయల 71 పైసలకు చేరింది. విశాఖలో పెట్రోల్ 114 రూపాయల 30 పైసలు, డీజిల్ 100 రూపాయల 20 పైసలకు ఎగబాకింది. ఢిల్లీలో పెట్రోల్ 101 రూపాయల 1 పైస, డీజిల్ 92 రూపాయల 27 పైసలకు పెరిగింది.
ముంబైలో పెట్రోల్ 115 రూపాయల 88 పైసలు, డీజిల్ 100 రూపాయల 10 పైసలుగా ఉంది. చెన్నైలో పెట్రోల్ 106 రూపాయల 69 పైసలు, డీజిల్ 96 రూపాయల 76 పైసలకు పెరిగింది. కోల్ కతాలో పెట్రోల్ 110 రూపాయల 52 పైసలు, డీజిల్ 95 రూపాయల 42 పైసలకు చేరింది. బెంగళూరులో పెట్రోల్ 105 రూపాయల 62 పైసలు, డీజిల్ 89 రూపాయల 70 పైసలుగా ఉంది.
కాగా, మార్చి 22 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.5.60 పెరిగింది.