హైదరాబాద్‌లో రూ.115 దాటిన పెట్రోల్ రేటు

దేశంలో వరుసగా ఏడో రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెరిగింది. గత పదిరోజుల్లో ధరలు పెరగడం ఇది తొమ్మిదోసారి. హైదరాబాద్ లో పెట్రోల్ 115 రూపాయల 42 పైసలు, డీజిల్ 101 రూపాయల 58 పైసలకు చేరింది. విశాఖలో పెట్రోల్ 115 రూపాయల 42 పైసలు, డీజిల్ 101 రూపాయల 27 పైసలకు ఎగబాకింది. ఢిల్లీలో పెట్రోల్ 101 రూపాయల 81 పైసలు, డీజిల్ 93 రూపాయల 7 పైసలకు పెరిగింది. 

ముంబైలో పెట్రోల్ 116 రూపాయల 72 పైసలు, డీజిల్ 100 రూపాయల 94 పైసలుగా ఉంది. చెన్నైలో పెట్రోల్ 107 రూపాయల 45 పైసలు, డీజిల్ 97 రూపాయల 52 పైసలకు పెరిగింది. కోల్ కతాలో పెట్రోల్ 111 రూపాయల 35 పైసలు, డీజిల్ 97 రూపాయల 52 పైసలకు చేరింది. బెంగళూరులో పెట్రోల్ 107 రూపాయల 30 పైసలు, డీజిల్ 91 రూపాయల 27 పైసలుగా ఉంది.