లీటర్ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ 2 రూపాయలు పెంపు

లీటర్ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ 2 రూపాయలు పెంపు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ ధరపై 2 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎక్సైజ్ డ్యూటీ 2 రూపాయలు పెరగడంతో ఆ భారం తమపై పడుతుందేమోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయలో కేంద్ర పెట్రోలియం శాఖ ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చింది.

ఎక్సైజ్ సుంకం రెండు రూపాయలు పెంచడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి పెంపు ఉండదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా క్రూడాయిల్ ధరలు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఏప్రిల్ 2021 తర్వాత బ్యారెల్ క్రూడాయిల్ ధర 63 డాలర్లకు పడిపోవడం గమనార్హం. హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర సోమవారం నాడు 107 రూపాయల 46 పైసలుగా ఉంది.

Also Read:-రూ.16 లక్షల కోట్లు ఆవిరి.. టాటాలకు లక్ష కోట్లు లాస్..

గల్ఫ్ దేశాల్లో క్రూడాయిల్ రేటు పెరిగితే మన దేశంలో పెట్రో ధరలు పెరుగుతాయని సాధారణ జనం అనుకుంటుంటారు. అయితే ఈ పెట్రో ధరల పెంపుపై విదేశీ మారకద్రవ్యం, డాలర్ రేట్లు, మార్కెట్ల ఒడిదుడుకులు, అంతర్జాతీయ రాజకీయాంశాల ప్రభావం ఉంటుంది. ఇక కేంద్ర, రాష్ట్రాల అధిక పన్నులు సరేసరి. అయితే ఏ వినియోగదారుడూ వీటిలో ఏ ఒక్కదాని గురించి ఆలోచించడు. పెట్రో ధరలు పెరిగాయా? తగ్గాయా? అన్నదే చూస్తారు.