భారీగా పెరిగిన పెట్రోల్‌‌‌‌, డీజిల్ సేల్స్‌‌‌‌

భారీగా పెరిగిన పెట్రోల్‌‌‌‌, డీజిల్ సేల్స్‌‌‌‌

న్యూఢిల్లీ:  పెట్రోల్‌‌‌‌, డీజిల్ వినియోగం ఈ ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో పుంజుకుంది. పండుగ సీజన్‌‌‌‌ కారణంగా వీటి సేల్స్ పెరిగాయి.  నవంబర్‌‌‌‌‌‌‌‌కు ముందు నెలల్లో పెట్రోల్ అమ్మకాలు బాగానే ఉన్నా, డీజిల్ సేల్స్ మాత్రం పడిపోయాయి. ఐఓసీ, బీపీసీఎల్‌‌‌‌, హెచ్‌‌‌‌పీసీఎల్ డేటా ప్రకారం, పెట్రోల్ అమ్మకాలు ఈ ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో 31 లక్షల టన్నులకు చేరుకున్నాయి. కిందటేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో రికార్డ్‌‌‌‌ అయిన  28.6 లక్షల టన్నులతో పోలిస్తే 8.3 శాతం పెరిగాయి. డీజిల్ అమ్మకాలు 5.9  శాతం వృద్ధి చెంది 71 లక్షల టన్నులకు చేరుకున్నాయి. 

వర్షాకాలంలో   పెట్రోల్‌‌‌‌, డీజిల్ సేల్స్  డల్‌‌‌‌గా ఉన్నాయని, వర్షాలు తగ్గాక పెట్రోల్‌‌‌‌కు డిమాండ్ పెరిగిందని, డీజిల్‌‌‌‌ డిమాండ్ మాత్రం కిందటేడాదితో పోలిస్తే తక్కువగానే రికార్డయ్యిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో 29.6 లక్షల టన్నుల పెట్రోల్‌‌‌‌ అమ్ముడైంది. దీంతో పోలిస్తే నవంబర్‌‌‌‌‌‌‌‌లో  4.7 శాతం వృద్ధి కనిపించింది.  డీజిల్ డిమాండ్ 11 శాతం పెరిగి 65 లక్షల టన్నులకు ఎగిసింది. జెట్‌‌‌‌ ఫ్యూయల్ (ఏటీఎఫ్‌‌‌‌) అమ్మకాలు కిందటి నెలలో  ఏడాది ప్రాతిపదికన 3.6 శాతం పెరిగి 6,50,900 టన్నులకు చేరుకున్నాయి. కుకింగ్ గ్యాస్  ఎల్‌‌‌‌పీజీ సేల్స్ నవంబర్‌‌‌‌‌‌‌‌లో  ఏడాది ప్రాతిపదికన 7.3 శాతం వృద్ధి చెంది 27.6 లక్షల టన్నులను టచ్ చేశాయి. 

పెరిగిన ఏటీఎఫ్‌‌‌‌, ఎల్‌‌‌‌పీజీ ధరలు..

ఏటీఎఫ్ ధరలు కిలోలీటర్‌‌‌‌‌‌‌‌కు రూ.1,318 పెరిగి రూ.91,856.84 కు చేరుకుంది. 19 కేజీల కమర్షియల్ ఎల్‌‌‌‌పీజీ  సిలిండర్ ధర రూ.16.5 పెరిగి రూ.1,818.50 కి చేరుకుంది.  గ్లోబల్‌‌‌‌గా క్రూడాయిల్‌‌‌‌ ధరలను పరిగణనలోకి తీసుకొని రేట్లను ఫ్యూయల్ కంపెనీలు మార్చాయి.