
- జీడిమెట్ల బస్ డిపో వద్ద ఘటన
జీడిమెట్ల, వెలుగు: పెట్రోల్ ఓవర్ ఫ్లో అయి మంటలు చెలరేగి బైక్ దగ్ధమైన ఘటన సూరారం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌కు చెందిన సింహాచలం(30) ఇటీవల కొత్త బైక్ కొన్నాడు. మంగళవారం చింతల్లో ఉండే తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చాడు. తిరిగి వెళ్తూ జీడిమెట్ల బస్ డిపో వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో ట్యాంక్ ఫుల్ చేయించాడు.
కొంచెం ముందుకు వెళ్లగానే పెట్రోల్ ఓవర్ ఫ్లో అయ్యి ఇంజిన్‌పై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సింహాచలం వెంటనే బైక్ పై నుంచి దిగిపోయాడు. జీడిమెట్ల ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే బైక్ పూర్తిగా మంటల్లో దగ్ధమైంది.