హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.77.20, డీజిల్ రూ. 71.51
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం దేశవ్యాప్తంగా భారీగా తగ్గాయి. లీటరు పెట్రోల్‌పై 22 పైసల వరకు, డీజిల్‌పై 26 పైసలు తగ్గించారు. ధరలు ఇంతగా తగ్గడం ఈ నెలలో ఇదే తొలిసారి. ఇంటర్నేషనల్ మార్కెట్లలో చమురు ధరలు పడిపోవడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ నెలలో పలుసార్లు ధరలను తగ్గించాయి. గత ఏడు రోజులుగా లీటరు పెట్రోల్ ధరలు 69 పైసలకు పైగా తగ్గాయి. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలో లీటరు పెట్రోల్ ధర వరుసగా రూ.72.68, రూ. 75.36, రూ. 78.34, రూ. 75.51లు ఉంది. డీజిల్ ధరలు వరుసగా రూ. 65.68, రూ. 68.04, రూ. 68.84, రూ. 69.73 పలుకుతున్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌కు రూ.77.20, డీజిల్‌కు రూ.71.51వసూలు చేస్తున్నారు.