న్యూఢిల్లీ : మనదేశం నుంచి పెట్రోలియం, రత్నాలు, వ్యవసాయ రసాయనాలు, చక్కెర భారీగా ఎగుమతి అవుతున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, గత ఐదు సంవత్సరాలుగా ఈ విభాగాలు ప్రపంచ మార్కెట్లలో తమ వాటాను పెంచుకున్నాయి. 2018–2023 మధ్య ఎలక్ట్రికల్ వస్తువులు, న్యూమాటిక్ టైర్లు, ట్యాప్‌లు, వాల్వ్‌లు, సెమీకండక్టర్ పరికరాల ఎగుమతులు పుంజుకున్నాయి.
2023లో పెట్రోలియం ఎగుమతులు 84.96 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2018లో 6.45 శాతంగా ఉన్న భారతదేశ మార్కెట్ వాటా గత ఏడాది 12.59 శాతానికి పెరిగింది. 2018లో 16.27 శాతంగా ఉన్న రత్నాల గ్లోబల్ షిప్‌మెంట్‌లలో దేశం వాటా గత ఏడాది 36.53 శాతానికి పెరిగింది. ఇది 1.52 బిలియన్ డాలర్ల ఎగుమతులతో దేశాన్ని అగ్రస్థానానికి చేర్చింది.