పీఎఫ్ విత్ విషయంలో చాలామందికి చాలా రకాల సందేహాలుంటాయి. పీఎఫ్ ను విత్ డ్రా ప్రాసెస్ త్వరగా పూర్తి చేయాలంటే ఏం చేయాలి? క్లయిమ్ చేసుకున్న ఎన్ని రోజులకు డబ్బులు ఖాతాల్లో జమ అవుతుంది. పీఎఫ్ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఎంత డ్రా చేసుకోవచ్చు ఇలా అనేక క్వశ్చన్లు తలెత్తుతాయి. వీటి గురించి ఇప్పు డు తెలుసుకుందాం.
ప్రభుత్వ లేదా ప్రైవేట్ గా ఉద్యోగాలు చేసే వారికి పీఎఫ్ ఖాతా అనేది ఉంటుంది. నెలనెలా క్రెడిట్ అయ్యే శాలరీ నుంచి కొంత మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవు తూ ఉంటుంది. అయితే విత్ డ్రా చేసుకోవాలంటే ఇంతకు ముందు పీఎఫ్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉండేది.. ఇప్పుడు అలాకాదు.. ఈపీఎఫ్ వో వెబ్ సైట్ కి వెళ్లి ప్రాసె స్ పూర్తి చేస్తే డబ్బులు మన ఖాతాల్లో పడతాయి. మొబైల్ ద్వారా కూడా ఈ పనిని పూర్తి చేయొచ్చు. దీనికి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఈపీఎఫ్ఓలో ఖాతాదారుల సౌకర్యార్ధం చాలా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ లావాదేవీలు, అడ్వాన్స్ తీసుకోవడం, పెన్షన్ క్లెయిమ్ ఇలా అన్నీ ఇంట్లో కూర్చునే చేసుకోవచ్చు. దీనికోసం ఈపీఎఫ్ఓ యాప్ ఉమంగ్ అందుబాటులో ఉంది. ఉమంగ్ యాప్ ద్వారా కూడా EPFO సేవలను యాక్సెస్ చేసుకోవచ్చు.
దీని ద్వారా మీ పీఎఫ్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో తెలుసుకోవచ్చు. అంతే కాదు.. దీని నుంచి కూడా మీ పీఎప్ ఖాతాలో డబ్బులను డ్రా చేసుకోవచ్చు. దీనిని మీ మొబైల్ నుంచే డైరెక్ట్ గా చూసుకునే వీలుంటుంది.
ఉమంగ్ యాప్‌లో EPFo సేవలను ఎలా ఉపయోగించాలి..
యాప్ ఓపెన్ చేశాక సెర్చ్ మెనుకి వెళ్లి EPFO వెబ్ సైట్లోకి వెళ్లాలి. ‘Employee Centric’ ఎంపిక చేసుకోండి ‘Raise Claim’ ఎంపికపై క్లిక్ చేయాలి.
EPF UAN నంబర్‌ను నమోదు చేయాలి.రిజిస్టర్డ్ ఫోన్ నుంచి OTP వస్తుంది.. అది ఎంటర్ చేయండి. విత్ డ్రా చేసుకునే విధానాన్ని ఎంచుకోండి.. Submit పై క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు.
మీకు క్లెయిమ్ రిఫరెన్స్ నంబర్ వస్తుంది.. దీని ద్వారా క్లెయిమ్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు