మరింత ఈజీగా పీఎఫ్‌‌‌‌‌‌‌‌ విత్‌‌‌‌‌‌‌‌డ్రా

మరింత ఈజీగా  పీఎఫ్‌‌‌‌‌‌‌‌ విత్‌‌‌‌‌‌‌‌డ్రా

న్యూఢిల్లీ: ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ఓ) పీఎఫ్ డబ్బులు విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకునే ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ను మరింత సులభం చేసింది.  ఫండ్స్‌‌‌‌‌‌‌‌ విత్‌‌‌‌‌‌‌‌డ్రా కోసం ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకునే వారు ఇక నుంచి క్యాన్సిల్ చేసిన చెక్కు ఫొటోను అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయవలసిన అవసరం లేదు. 

అంతేకాకుండా వారి బ్యాంకు ఖాతాలను ఎంప్లాయర్లు ధ్రువీకరించాల్సిన అవసరం లేదు. దీంతో  క్లెయిమ్ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ మరింత వేగంగా జరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ఓ సభ్యులు పీఎఫ్‌‌‌‌‌‌‌‌ డబ్బులు విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకోవాలంటే  పీఎఫ్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌కు లింకై ఉన్న బ్యాంక్ అకౌంట్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌ కాపీని లేదా చెక్కు బుక్ కాపీని  అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాలి. బ్యాంక్ వివరాలను ఎంప్లాయర్లు ధ్రువీకరించాలి.