వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ పీజీ వైద్యురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కేఎంసీలో విధుల్లో ఉన్న పీజీ వైద్యురాలు డాక్టర్ ప్రీతి, పీజీ వైద్యుని వేధింపులు తాళలేక అనస్థీషియా ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యయత్నానికి యత్నించారు. ఇది గమనించిన తోటి వైద్యులు ఆమెకు వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా -ప్రీతి హైదరాబాద్ కు చెందిన ఓ రైల్వే ఎంప్లాయి కూతురుగా పోలీసులు గుర్తించారు. ఆసీఫ్ అనే సెకండ్ ఇయర్ పీజీ విద్యార్థి వేధింపులే ఈ ఘటను కారణమైనట్టు తెలుస్తోంది. అయితే గతంలోనూ వేధింపులపై అధికారులకు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశామని ప్రీతి కుటుంబసభ్యులు చెప్పారు. పీజీ వైద్యుని వేధింపులు తాళలేక ప్రీతి ఇబ్బంది పడిందని, రెండు, మూడు సార్లు తమకు చెబితే ప్రిన్సిపాల్, హెచ్ఓడీ దృష్టికి తీసుకు వెళ్ళామన్నారు. నిన్న సాయంత్రం ప్రిన్సిపాల్ కు తమ కూతురు చెప్పడంతో మరోసారి ఇద్దరిని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారని తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్న కుటుంబసభ్యులు.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలిస్తున్నామని వెల్లడించారు.
ఈ ఘటనపై కేఎంసీ ప్రిన్సిపాల్ డా. మోహన్ దాస్ & ఎంజీఎం సూపరింటెండెంట్ డా. చంద్రశేఖర్ స్పందించారు. డా. ప్రీతి మల్టీ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవడం వల్లే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. మెరుగైన వైద్య సేవలు కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించామన్నారు. సీనియర్ విద్యార్థి సైఫ్ ర్యాగింగ్ కు పాల్పడుతుస్తున్నాడని పోలీసులకు విద్యార్థిని తండ్రి ఫోన్ ద్వారా తెలిపారని చెప్పారు. పోలీసులు తమకు ఇచ్చిన సమాచారం మేరకు రెండు రోజుల క్రితం సైఫ్ అనే సీనియర్ పీజీ స్టూడెంట్ ను పిలిచి కౌన్సెలింగ్ చేశామని ప్రిన్సిపాల్ డా. మోహన్ దాస్ వివరించారు. అతను ర్యాగింగ్ చేయలేదని, డ్యూటీ విషయంలో మందలించానని తెలిపినట్టు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారన్నారు. -విచారణలో ర్యాగింగ్ అని తేలితే కచ్చితంగా బాధిత విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.