ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇప్పించాలి

  • మంత్రి పొన్నం ప్రభాకర్ కు పీజీ డాక్టర్ల వినతి 

ముషీరాబాద్,వెలుగు: ఫీజు రీయింబర్స్‌‌‌‌ మెంట్ బకాయిలను ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను పీజీ డాక్టర్లు విజ్ఞప్తి చేశారు. ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో 2020లో  పీజీ పూర్తి చేసిన డాక్టర్లు ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్ లో  మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.

గత ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని వాపోయారు. మంత్రి పొన్నం సానుకూలంగా స్పందించి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని భాగ్యలక్ష్మి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో అక్షిత, శ్యామిలి, అనిల్ కుమార్, రాజేష్, శ్యాం కుమార్ గౌడ్, మహేష్, సీహెచ్ రత్నాకర్ తదితరులు ఉన్నారు.