పీజీఈసెట్ పరీక్షలు షురూ

పీజీఈసెట్ పరీక్షలు షురూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సోమవారం రెండు సెషన్లలో ఎగ్జామ్స్ జరిగాయి. మార్నింగ్ సెషన్​లో జియో ఇంజినీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్, ఫార్మసీ కోర్సులకు పరీక్షలు జరగ్గా 7,461 మందికి గాను 7,179 (96.22%) మంది అటెండ్ అయ్యారని పీజీఈసెట్ కన్వీనర్ అరుణకుమారి తెలిపారు.

మధ్యాహ్నం సెషన్​లో సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ర్టికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఏరోస్పెస్ ఇంజినీరింగ్ తదితర కోర్సులకు ఎగ్జామ్స్ జరిగాయని, దీంట్లో 5,477 మందికి గాను 4,898 (89.43%) అటెండ్ అయ్యారని చెప్పారు. ఈ పరీక్షలను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్  ప్రొఫెసర్ లింబాద్రి, కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్,  జేఎన్టీయూ రెక్టార్ ప్రొఫెసర్ విజయకుమార్ రెడ్డి, రిజిస్ట్రార్​ వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.