ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఇద్దరు యువకుల నోటికి గుడ్డ బిగించి బెల్ట్‌తో కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఘటన నెల క్రితం జరగ్గా.. వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో ఆగ్రా పోలీస్ యంత్రాంగం ఇప్పుడు అప్రమత్తమైంది.
అసలేం జరిగిందంటే..?
శివమ్ అనే విద్యార్థి, అతని స్నేహితుడితో కలిసి ఆగ్రాలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. వీరిద్దరూ స్థానికంగా పదకొండో తరగతి చదువుతున్నారు. నెల రోజుల క్రితం అద్దె విషయమై వీరికి హాస్టల్ యజమానితో చిన్న గొడవ జరిగింది. సకాలంలో అద్దె చెల్లించకపోతే ఖాళీ చేసి వెళ్లిపోండి అన్నట్లు యజమాని మాట్లాడగా.. వారు సరే అన్నట్లు సమాధానమిచ్చారు. అయితే, విద్యార్థులు తనకు ఎదురు సమాధానం చెప్పడాన్ని సదరు హాస్టల్ మేనేజర్ పట్టలేకపోయాడు.
ఒకరోజు ఇద్దరిని గదిలో బంధించి, అరవకుండా వారి నోటికి గుడ్డలు కట్టి బెల్టుతో దారుణంగా కొట్టాడు. వద్దని ఎంత బ్రతిమలాడినా విడిచి పెట్టలేదు. ఇష్టమొచ్చినట్లు చావబాదాడు. కొన్ని గంటల అనంతరం వారిని విడిచిపెట్టాడు. ఈ ఘటన అనంతరం విధ్యార్థిలిద్దరూ భయంతో ఎక్కడా పిర్యాదు చేయలేదు. సొంతూళ్లకు వెళ్లిపోయారు.
ALSO READ | సిద్దిఖీ కొడుకును కూడా హతమార్చేందుకు ప్లాన్
ఈ ఘటన ఓ నెటిజెన్ దృష్టికి రాగా.. అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. "ఆగ్రాలో క్రూరత్వం హద్దులు దాటింది. అద్దె వివాదంలో పీజీ హాస్టల్ యజమాని.. విద్యార్థి శివమ్, అతని స్నేహితుడిని బంధించి దారుణంగా కొట్టాడు.." అని పోస్టులో వివరించాడు.
The video of students being beaten up is from Agra. Here, 2 students studying in class 11 were being thrashed with a belt by the PG Owner. The video is said to be a month old.#Agra | #UttarPradesh | @agrapolice | @Uppolice | #viralvideo pic.twitter.com/goP7k2WsXx
— Krishna Chaudhary (@KrishnaTOI) October 15, 2024
వీడియో వైరల్ అవ్వడంతో ఆగ్రా పోలీస్ కమిషనర్ స్పందించారు. సదరు హాస్టల్ మేనేజర్‌కు నోటీసులు జారీ చేయబడ్డాయని, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.