యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌‌‌‌లో పీజీ

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌‌‌‌లో పీజీ

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 2024-25 విద్యా సంవత్సరానికి 41 పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేసింది. సీయూఈటీ పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థు లు మే 15వ తేదీలోగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సులు: ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంవీఏ, ఎంఈడీ, ఎంపీహెచ్‌‌‌‌, ఎంపీఏ, ఎంఎఫ్‌‌‌‌ఏ కోర్సుల్లో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ బయాలజీ, యానిమల్ బయాలజీ, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఇంగ్లీష్​, హిందీ, ఫిలాసఫీ, తెలుగు, ఉర్దూ సబ్జెక్టులు ఉంటాయి.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీయూఈటీ (పీజీ)-2024 స్కోరు సాధించి ఉండాలి.

సెలెక్షన్: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సీయూఈటీ (పీజీ)-2024 స్కోర్, ఇంటర్వ్యూ, రూల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్​లైన్​లో మే 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.acad.uohyd.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.