పాత పేపర్తోనే పీజీ సెమిస్టర్ ఎగ్జామ్ .. కాళోజి యూనివర్సిటీ ఆఫీసర్ల నిర్లక్ష్యం


వరంగల్ లోని కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు పూర్తి నిర్లక్ష్యం బయటపడింది. ఈనెల 16న జరిగిన పోస్టు గ్రా డ్యుయేషన్ రేడియాలజీ విభాగానికి చెందిన పరీ క్షలో 2023, నవంబర్ లో జరిగిన పాత పేపర్ ను ఎలాంటి మార్పు లేకుండా అప్లోడ్ చేశారు. కనీసం పరీక్ష పేపర్ కోడ్ ను కూడా మార్చకుండా యధావిధిగా పాత పేపర్ ని విద్యార్థులకు అందించారు. ఫలితంగా విద్యార్థులు అయోమ యానికి గురయ్యారు. ఆలస్యంగా ఈ విషయం బయటికి రావడంతో అధికారులు హుటాహు టిన యూనివర్సిటీ భవనంలో సమావేశమయ్యారు.

Also Read : సీఎం కుర్చీ కాపాడుకునేందుకే రేవంత్ ఢిల్లీకి చక్కర్లు

 ఈ సందర్భంగా ఎగ్జామినేషన్ ఇంచార్జ్ డాక్టర్ మల్లేశ్వర్ మాట్లాడుతూ.. తప్పిదం జరిగిన మాట వాస్తవమే అని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర అధికారులతో పాటు యూనివర్సిటీ వైస్ ఛాన్సర్ కరుణాకర్ రెడ్డికి సైతం విషయం చెప్పి నట్లు తెలిపారు. అలాగే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు కమిటీని కూడా వేయనున్నట్లు ఆయన చెప్పారు. వీసీ యూనివర్సి టీకి సంబంధించిన పలు విషయాల్లో సమయం కేటాయించకపోవడంవల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని విద్యార్థులు విమర్శిస్తున్నారు.