వాళ్ళే చంపేసి.. హైడ్రామా క్రియేట్ చేశారు: ప్రీతి పిన్ని

మెడికో స్టూడెంట్ ప్రీతి కుటుంబంలో విషాదఛాయలు అలుముతున్నాయి. ప్రీతి ఇక లేదన్న విషయం ఆమె కుటుంబసభ్యులతో పాటు.. గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె విషయంలో అంతా హైడ్రామా క్రియేట్ చేశారని.. నిందితుడిని తప్పించే ప్రయత్నంలోనే రిమాండ్‭కు పంపారని వారు ఆరోపిస్తున్నారు. ఏ విషయంలో అయినా ఆమె చాలా ధైర్యంగా ఉంటుందని.. ఒక గిరిజన అమ్మాయి డాక్టర్ స్థాయికి వెళ్లడం అంత సులభం కాదని ప్రీతి పిన్ని చెబుతున్నారు. కావాలనే ఆమెను చంపేసి.. అంతా నాటకం ఆడారని ఆరోపించారు. ప్రీతికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితుల్ని శిక్షించాలని కోరారు.