పీజీఈసెట్ ఎగ్జామ్ వాయిదా.. రీషెడ్యూల్ విడుదల

పీజీఈసెట్ ఎగ్జామ్ వాయిదా.. రీషెడ్యూల్ విడుదల

హైదరాబాద్, వెలుగు :  ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పీజీఈ సెట్ ఎగ్జామ్ వాయిదా పడింది. గ్రూప్1 ఎగ్జామ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల కారణంగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం(జూన్ 6 నుంచి 9 వరకు) ఎగ్జామ్ నిర్వహించడం లేదని పీజీఈసెట్ కన్వీనర్ అరుణకుమారి తెలిపారు. ఈ పరీక్ష తేదీల్లో మార్పులు చేశామని.. జూన్ 10 నుంచి 13 వరకు ఎగ్జామ్ నిర్వహిస్తామని వెల్లడించారు.మరిన్ని వివరాలకు https://pgecet.tsche.ac.in/ను చూడాలని కోరారు. మార్చి 16 నుంచి పీజీఈసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు 22,263 దరఖాస్తులు అందగా.. వాటిలో హైదరాబాద్ సెంటర్లలో 17,926 మంది, వరంగల్ సెంటర్ పరిధిలో 4,337 మంది ఉన్నారు. రూ.2,500 ఫైన్​తో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.