బడ్జెట్‌‌‌‌‌‌‌‌ నుంచి ఫార్మాకు ఇవి కావాలి

బడ్జెట్‌‌‌‌‌‌‌‌ నుంచి ఫార్మాకు ఇవి కావాలి

న్యూఢిల్లీ: బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో కార్పొరేట్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ రాయితీలను ప్రకటించాలని, రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోసం కేటాయింపులు పెంచాలని, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని కాపాడేందుకు సమర్ధవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఫార్మా స్యూటికల్ ఇండస్ట్రీ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ నెల 23 న  ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ఫార్మా సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏం కావాలో ఆర్గనేజేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూషర్స్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఇండియా (ఓపీపీఐ) ఆదివారం ప్రకటించింది.

ఎంఎన్‌‌‌‌‌‌‌‌సీలకు రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌లను, కార్పొరేట్ ట్యాక్స్ రాయితీలను ఇవ్వాలని ఓపీపీఐ డైరెక్టర్ జనరల్‌‌‌‌‌‌‌‌ అనీల్ మాటియా కోరారు. ఫలితంగా క్లినికల్ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌, పేటెంట్ రిజిస్ట్రేషన్ వేగంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఫార్మా ఉద్యోగులకు స్పెషల్ ట్రెయినింగ్ ఇచ్చేందుకు సెంటర్లకు, కంపెనీలకు  ప్రోత్సాహకాలను ప్రకటించాలని కోరారు. అరుదైన వ్యాధులకు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ డెవలప్ చేస్తే ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌లు ఇవ్వాలని అన్నారు.

సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌లెన్స్ (సీఓఈ) ద్వారా   అరుదైన వ్యాధులను సమర్ధంగా మేనేజ్ చేయాలన్నారు. జీఎస్‌‌‌‌‌‌‌‌టీ మినహాయింపులు పొందుతున్న కీలక మందుల లిస్ట్‌‌‌‌‌‌‌‌ను పెంచాలన్నారు. మొత్తం ఆంకాలజీ మెడిసిన్స్  ఈ లిస్ట్‌‌‌‌‌‌‌‌ కిందకు తీసుకురావాలన్నారు. ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లను ఆకర్షించేందుకు ఫార్మా కంపెనీలు ఇష్యూ చేసే బాండ్లపై  ప్రోత్సాహకాలు ఇవ్వాలని అనీల్ ప్రభుత్వాన్ని కోరారు.